కేశినేని నాని ట్వీట్లపై పీవీపీ సెటైర్లు.. అమ్మ ఒడిలో ఫీజు రీయింబర్సుమెంట్..!

Wednesday, September 11th, 2019, 03:45:23 PM IST

ఏపీలో ఎన్న్నికలు ముగిసాకా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత పీవీపీ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ట్విట్టర్‌లో వీరి బూతు పురాణం ఒకానొక సమయంలో తారా స్థాయికి చేరుకున్నది. అయితే ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకున్న ఈ ఇద్దరు నేతలు కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్నారు. అయితే తాజాగా పీవీపీ కేశినేనిపై మళ్ళీ మాటల తూటాలు పేల్చారు.

అయితే తాజాగా ఎంపీ కేశినేని నాని చేసిన ఒక ట్వీట్‌లో స్పెల్లింగ్ మిస్టేక్‌లను దొరకబుచ్చుకున్న పీవీపీ కేశినేని నానిపై దిమ్మతిరిగే ఆరోపణలు చేసారు. ఏమయ్యా ఎంపీ నీ చేతలతో ఎలాగూ నరకం చూపిస్తున్నావు. తమరి భాషా పరిజ్ఞానానికి చస్తున్నాము బాబు. It is called BIASED. Not baised. నువ్వేదో ఒక భగత్ సింగ్‌లా బిల్డప్ వద్దు. రోడ్డులెక్కి, IPS ఆఫీసర్స్ మీద రౌడీయిజం చేసినపుడు నీకు డెమెక్రసీ, రాజ్యాంగం లాంటివి గుర్తుకు రాలేదా. ప్రజా సంక్షేమం కోరి, మీ తరపున, అమ్మఒడిలో ఫీజు రీయింబర్సుమెంట్ చేయిస్తాను. కాస్త ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ పరీక్ష కడితే అంటూ నానిపై సెటైర్లు విసిరారు.