సౌత్ క్వీన్స్ ఫస్ట్ లుక్ తో వచ్చేస్తున్నారు ?

Wednesday, April 18th, 2018, 11:23:32 PM IST

బాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచినా క్వీన్ చిత్రాన్ని సౌత్ ఇండియన్ 4 భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషించిన ఈ పాత్రలో తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, కన్నడంలో పారుల్ యాదవ్, మలయాళంలో మంజిమ మోహన్ లు నటిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి నీలకంఠ దర్శకత్వం వహించాడు .. అనుకోకుండా తమన్నా తో వచ్చిన విభేదాల వల్ల అయన తప్పుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం తమిళ భాషలో సినిమా చేస్తున్న నటుడు రమేష్ అరవింద్ తెలుగు వెర్షన్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇక త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక్క తెలుగు వెర్షన్ దే కాకుండా నాలుగు భాషలకు సంబందించిన ఫస్ట్ లుక్స్ ని విడుదల చేస్తారట. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్న నేపథ్యంలో బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఫస్ట్ లుక్ విడుదల డేట్ ని త్వరలోనే కన్ఫర్మ్ చేస్తారట. మరి ఈ సౌత్ క్వీన్స్ ఎలా ఉంటారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments