సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదే… ఆర్.కృష్ణయ్య

Thursday, November 14th, 2019, 12:20:40 AM IST

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం వలన రాష్ట్రంలోని విపక్షాలు అన్ని కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కానీ సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో కొందరు కీలకమైన నేతలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. కాగా ఈ విషయంలో ఆర్.కృష్ణయ్య కూడా సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యా విధానంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అని, రాష్ట్రంలోని పిల్లలందరి కి కూడా మంచి సదవకాశాన్ని సీఎం జగన్ అందించారని ఆర్.కృష్ణయ్య చెప్పుకొస్తున్నారు.

ఇంతేకాకుండా ఈ నిర్ణయం వలన పేద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి, వారి బంగారు భవిష్యత్తు పునాది అవుతుందని చెప్పారు. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎలాంటి ఉద్యోగం సంపాదించాలన్న కూడా ఆంగ్ల భాష పరిజ్ఞానం తప్పనిసరి, ఇంగ్లిష్ మీడియం చదువు చదవడం వలన మంచి ఉద్యోగావకాశాలు కూడా బాగా పెరుగుతాయని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. కాగా ఈ మధ్య కాలంలో రోజువారీ కూలీలు కూడా అప్పు చేసి మరీ తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం లో చదివిస్తున్నారని, అయితే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వలన ఇకనుండి వారికి ఎలాంటి బాధలు ఉండవని స్పష్టం చేశారు ఆర్.కృష్ణయ్య.