వైయస్ జగన్ కి మద్దతు ఇస్తున్న ఆర్.నారాయణమూర్తి…అసలు విషయం ఏమిటంటే?

Monday, November 18th, 2019, 08:51:48 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం పై ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నవారే ఐఏఎస్, ఐపీఎస్, ఇంజినీర్లు, డాక్టర్లు అవుతున్నారు, తెలుగు మీడియం చదువుకుంటున్న పేద వర్గాల ప్రజలు సెక్యూరిటీ గార్డు,పోలీస్ కానిస్టేబులు వంటి చిన్నపాటి ఉద్యోగాలకి పరిమితమవుతున్నారు అని సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. తాండ్ర పాపారాయుడు ఆవిష్కరించిన అయన పలు విషయాలని వివరించారు.
ఎల్కేజీ నుండి పీజీ వరకు అందరికి సమన అవకాశం కల్పించినప్పుడే పేదల భవిష్యత్ బావుంటుంది అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. అయితే ఈ సందర్భంలో ఒక విషయాన్నీ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన తీసుకు వస్తున్న సీఎం జగన్ కి నా సపోర్ట్ అని అన్నారు. అయితే ఇంగ్లీష్ చదువులు లేక వెనకబడిన తరగతులు వారు ఎలా వెనకబడుతున్నారో తన ఎర్ర సైన్యం చిత్రంలో చూపించానని గుర్తు చేసారు.

అయితే ఈ కార్యక్రమంలో మంత్రి కన్నబాబు ఆర్. నారాయణమూర్తి పొగుడుతూనే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. 20 ఏళ్ల క్రితమే నారాయణమూర్తి ఇంగ్లీష్ మీడియం గురించి తెలియజేసిన దార్శనికుడు అని అన్నారు. ప్రశ్నింస్తానన్న వ్యక్తి కనపడకుండా పొతే, ఆర్. నారాయణమూర్తి సినిమాల ద్వారా ప్రశ్నిస్తూనే వున్నారని అన్నారు.