పిక్ టాక్ : రాజమౌళి క్రికెట్ టీమ్ అదిరింది

Saturday, September 30th, 2017, 10:03:21 AM IST


బాహుబలి తర్వాత దర్శకదీరుడు ఎటువంటి సినిమా తీయనున్నారు అని ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే అయిదు సవత్సరాలు విశ్రాంతి లేకుండా బాహుబలి కోసం కష్టపడినందుకు జక్కన్న మాత్రం బ్రేక్ తీసుకొని హ్యాపీగా హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఎటువంటి టెన్షన్స్ లేకుండా ప్రముఖ ప్రదేశాలని చుట్టేస్తున్నాడు. రీసెంట్ గా శ్రీలంక వెళ్లిన దర్శక ధీరుడు అక్కడ ప్రముఖ ప్రదేశాలను సందర్శించాడు. అంతే కాకుండా అక్కడ యువ క్రికెటర్లతో కాసేపు క్రికెట్ ఆడాడు. అక్కడి ప్రముఖ క్రికెట్ స్టేడియంలలో ఒకటైన గాలెలో స్థానిక తమిళ క్రికెటర్లతో కలిసి క్రికెట్ ఆడి ఎంజాయ్ చేశారు. ఎప్పుడు కెమెరా – యాక్షన్ అనే రాజమౌళి సిక్సర్ – అవుట్ అని ఆటలో మునిగి తేలాడు. క్రికెట్ ఆడిన యువకులతో ఒక ఫొటో దిగి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments