మరో సమస్యలో రాజశేఖర్ ఫ్యామిలీ.. యాక్సిడెంట్ చేసిన కుమార్తె

Sunday, November 5th, 2017, 11:41:48 AM IST

ప్రస్తుత రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా రాజశేఖర్ ఫ్యామిలీ అనేక సమస్యలతో సతమతమవుతోంది. రీసెంట్ గా మరొక సమస్య తో మళ్లీ ఆ ఫ్యామిలీకి తలనొప్పులు వచ్చి పడ్డాయని తెలుస్తోంది. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని ఆగివున్న కారును ఢీకొట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ చాలా వైరల్ అయ్యింది. ప్రమాదం చిన్నదే కావడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. శనివారం జూబ్లీహిల్స్ నుంచి తన ఇంటికి వెళుతున్న శివాని అనుకోకుండా ఆగివున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైన కారు ఓనర్ రూ.30 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా కొత్త కారును కొన్నానని ఎలాగైనా డబ్బు చెల్లించాలని బాధితుడు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. అయితే రీసెంట్ గా రాజశేఖర్ కూడా తన తల్లి చనిపోయిన సమయంలో బాధకి లోనై ఇదే తరహాలో ఒక ఘటనను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments