హర్రర్ తో భయపెడతానంటున్న మాజీ భామ !!

Thursday, February 23rd, 2017, 06:31:04 PM IST


హర్రర్ సినిమాల ట్రెండ్ ఇంకా బాగానే ఉంది. ఇప్పటికే ఈ తరహా సినిమాలు చాలానే వస్తున్నాయి. గత ఏడాది ఈ తరహా చిత్రాలు సత్తా చాటడంతో ఇలాంటి సినిమాల ట్రెండ్ పెరిగింది. ఇక ఈ తరహా సినిమాలు చేయడానికి స్టార్ హీరోయిన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో మాజీ భామలు కూడా ఈ తరహా సినిమాలతో ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా మాజీ గ్లామర్ భామ రాశి ఈ మద్యే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఆమె సోలోగా హర్రర్ సినిమాతో భయపెట్టడానికి రెడీ అయింది. రాశి నటిస్తున్న ఈ సినిమా పేరు లంక. ఈ మధ్య టివి షో లు చేసినా పెద్దగా లాభం లేని రాశీ హర్రర్ సినిమాతో మంచి హిట్ అందుకుని ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తుంది. మరి ఈ సినిమాతో రాశి ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుంటుందో చూడాలి !!