రేస్ 3 పోస్ట‌ర్‌ : భాయ్‌తో జాక్విలిన్ మైండ్ బ్లో!!

Friday, April 27th, 2018, 07:58:33 PM IST

స‌ల్మాన్ భాయ్ గుండె ఖిల్లా కొల్ల‌గొట్టాడు. త‌న చెంత‌నే జాక్విలిన్ అంద‌చందాలు .. బ్యాక్ లెస్ ఫోజులో యూత్ గుండెకు గాయం చేసింది. అస‌లు ఆ స్టిల్ చూస్తుంటేనే టెంప్టింగ్ అన‌డంలో సందేహం లేదు. `రేస్‌` సిరీస్ మోస్ట్ వాంటెడ్ సీక్వెల్ మూవీగా `రేస్ 3` పేరు ప్ర‌స్తుతం మార్మోగిపోతోంది. కొరియోగ్రాఫ‌ర్ ట‌ర్న్‌డ్ డైరెక్ట‌ర్ రెమో డి.సౌజా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే నాలుగైదు శాంపిల్ పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేసింది చిత్ర‌బృందం. పోస్ట‌ర్ల‌తోనే వేడి పెంచ‌డంలో స‌ల్మాన్ భాయ్ బృందం పెద్ద స‌క్సెసైంది.

ఈ సినిమా `రేస్‌` సిరీస్‌లోనే మోస్ట్ స్పైసీగా, రేసీగా .. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇటీవ‌లే `ఏక్ దో తీన్‌..` అంటూ ఓ రేంజులో వేడి పెంచిన జాక్విలిన్ `రేస్ 3`ని అదే రేంజులో వేడెక్కించ‌బోతోంద‌ని పోస్ట‌ర్లు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం ల‌ఢ‌ఖ్‌(హిమాల‌యాలు)లోని ఎత్త‌యిన ప‌ర్వ‌తాల్లో `రేస్ 3` పాట చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అక్క‌డ స‌ల్మాన్ భాయ్‌తో జాక్విలిన్ షికార్ల వీడియోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలోకి వ‌చ్చాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ మ‌తి చెడ‌గొడుతోంది. ఎస్‌.కె.ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. ఈద్ కానుక‌గా సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments