పోస్ట‌ర్ టాక్‌ : జాక్విలిన్ అలా షాకిచ్చింది

Monday, May 7th, 2018, 11:18:44 PM IST

స‌ల్మాన్ ప్ర‌ధాన పాత్ర‌లో రెమో.డి.సౌజా ద‌ర్శ‌క‌త్వ ం వ‌హిస్తున్న చిత్రం `రేస్ 3`. ఈ క్రేజీ సీక్వెల్ మూవీ ఇంకా సెట్స్‌లో ఉండ‌గానే యూత్‌లో అసాధార‌ణ క్రేజు నెల‌కొంది. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన నాలుగు పోస్ట‌ర్లు ఆ స్థాయిలో ఇంపాక్ట్ క‌ల‌గ‌జేశాయి. స‌ల్మాన్‌తో జాక్విలిన్ స్ట‌న్నింగ్ పోస్ట‌ర్‌ని ఇటీవ‌ల రిలీజ్ చేశారు. స‌ల్మాన్ ఫ్యాన్స్‌తో పాటు, జాక్విలిన్ వీరాభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ ట్రీట్ ఆ పోస్ట‌ర్‌.

తాజాగా మ‌రో కొత్త పోస్ట‌ర్‌ని రివీల్ చేసింది యూనిట్. ఈ పోస్ట‌ర్ పూర్తిగా షాకిచ్చే పోస్ట‌ర్‌. ఇందులో స‌న్నీడియోల్‌తో జాక్విలిన్ క‌నిపించి వేడి పెంచింది. అస‌లు ఈ చిత్రంలో జాక్విలిన్ ఎవ‌రి స‌ర‌స‌న న‌టిస్తోంది? అన్న‌ది పెద్ద స‌స్పెన్స్‌. ఇక గ‌న్ చేత‌బ‌ట్టి స‌ల్మాన్ స‌ర‌స‌న జాక్విలిన్ ఇచ్చిన‌ ఫోజును మ‌ర్చిపోక‌ముందే స‌న్నీడియోల్‌తో ఇలా రొమాంటిక్‌గా చెల‌రేగిపోతున్న పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయ‌డం వెన‌క ఆంత‌ర్యం ఏంటి? అన్న‌ది ఆలోచించాల్సిందే. ఈద్ కానుక‌గా రిలీజ్ కానున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.