`రేస్ -3` ప్రీరిలీజ్‌ బిజినెస్ @ 300 కోట్లు?

Tuesday, April 3rd, 2018, 08:08:48 PM IST

ప్ర‌స్తుత స‌న్నివేశంలో సినిమాల మార్కెట్ రేంజ్ పెరిగింది. హీరోల స్టామినా అంతే రెట్టింపైంది. ఇదివ‌ర‌క‌టితో పోలిస్తే డిజిట‌ల్ రిలీజ్ రాక‌తో.. నిర్మాత‌ల‌కు రిలీజ్ ముందే భారీ మొత్తాలు టేబుల్‌పైకి వ‌స్తున్నాయ్‌. ప‌వ‌న్‌, మ‌హేష్‌, బ‌న్ని, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ లాంటి స్టార్ల‌కే మార్కెట్ అదిరిపోతోంది. దాదాపు 100 నుంచి 120 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగుతోంది. కేవ‌లం తెలుగు స్టార్ల‌కే అంత డిమాండ్ ఉంది అంటే, ఇక బాలీవుడ్ స్టార్ల రేంజు, అందునా ఖాన్‌ల రేంజు ఎలా ఉంటుందో అంచ‌నా వేయ‌గ‌లం. డిజిట‌ల్ రిలీజ్, శాటిలైట్‌, ఆడియో రైట్స్‌, థియేట్రిక‌ల్ రైట్స్‌, ఓవ‌ర్సీస్ అంటూ ర‌క‌ర‌కాల మార్గాల్లో ప్రీరిలీజ్ దాదాపు 300 కోట్ల మార్క్‌ని ట‌చ్ చేయ‌డం ఖాయం.

ప్ర‌స్తుతం స‌ల్మాన్ భాయ్ న‌టిస్తున్న `రేస్-3` ప్రీరిలీజ్ హైప్ అసాధార‌ణంగా ఉంది. ఇంకా స‌గం షూటింగ్ అయినా పూర్త‌వ్వ‌క‌ముందే, అద్భుత‌మైన ఫిగ‌ర్స్ ప్ర‌చారంలోకి వ‌చ్చేశాయి. ఇక ఈ సినిమా థియేట్రిక‌ల్ రిలీజ్ హ‌క్కుల కోసం ఏకంగా 140 కోట్ల మేర చెల్లించనున్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే దీనిని టిప్స్ అధినేత‌, చిత్ర నిర్మాత ర‌మేష్ తురాణీ ఖండించారు. ఇంకా ఈ సినిమా బిజినెస్‌కి సంబంధించి ఎలాంటి చ‌ర్చ‌లు సాగ‌లేదు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌పైనే దృష్టి సారించాం. బ‌య‌ట సాగుతున్న ప్ర‌చారం స‌రికాదు.. అని కొట్టిపారేశారు. అయితే స‌ల్మాన్ రేంజుకు ఓవ‌రాల్ బిజినెస్ 300 కోట్ల‌ను ట‌చ్ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. అత‌డు న‌టించిన సినిమాలు 500-600 కోట్లు సునాయాసంగా వ‌సూలు చేస్తున్నాయి. ఇక ఇటీవ‌లి కాలంలో చైనా మార్కెట్ అద‌నంగా యాడైంది కాబట్టి మార్కెట్ ప‌రంగా మ‌రింత హుషారు క‌నిపించ‌నుంది

  •  
  •  
  •  
  •  

Comments