బ్రేకింగ్: జగన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ..!

Monday, June 3rd, 2019, 10:51:43 AM IST

ఏపీలో ఈ ధఫా జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసారు. అయితే జగన్ తన ప్రమాణస్వీకారం రోజునే మీడియాపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. చంద్ర‌బాబు మీద అభిమానంతో త‌మ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా త‌ప్పుడు వార్త‌లు రాస్తే కేసులు వేస్తామంటూ ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5 వార్తా సంస్థ‌ల‌కు జగన్ బహిరంగంగానే హెచ్చరించారు.

అంతేకాదు కాంట్రాక్టుల విష‌యంలో చ‌ట్ట‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని, అవినీతిని పూర్తిగా అరికడతామని జగన్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దానికి మీడియా కూడా సహకరించాలని తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు వార్తలను రాస్తే కేసులు పెడతామంటూ జగన్ బెదిరించిన మాటలకు ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ గట్టి కౌంటర్ ఇచ్చారు. అవినీతిని అరికట్టాలనుకుంటున్న సీఎం జగన్ గారి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని, మంచిని ఏ విధంగా అయితే రాసి చూపిస్తామో, చెడును కూడా అదే విధంగా ఎత్తి చూపిస్తామని అన్నారు. ఏ ప్రభుత్వమైనా తప్పుచేస్తే దానిని ప్రజలకు తెలియ చెప్పడం మా బాధ్యత అని ఆయన అన్నారు. అయితే కేసులేమి మాకు కొత్త కాదని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారి ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపినందుకు ఆంధ్రజ్యోతిపై కేసులు పెట్టారు. అయితే గత ఐదేళ్ళుగా మీ సొంత మీడియా సాక్షి వ్యవహరించిన తీరు అందరికి తెలిసిందే. అయితే దానికి సంబంధించి మీపై కూడా ఎన్ని కేసులు పెట్టాల్సి వస్తుందో ఆలోచించుకోమని రాధాకృష్ణ జగన్‌కు గట్టి కౌంటర్ వేశారు.