బీచ్ లో చీరకట్టుకోమంటారా ఏంటి? : రాధికా ఆప్టే

Saturday, March 10th, 2018, 06:30:12 PM IST

హాట్ బ్యూటీ రాధికా ఆప్టే అంటే ఘాటుగా కనిపించడమే కాదు.. ఘాటైన కౌంటర్లను ఇవ్వడంలో కూడా ముందుంటారు. తనపై ఎలాంటి విమర్శలు వచ్చినా కూడా రాధికా వెంటనే కౌంటర్ ఇస్తుంది. ఇకపోతే రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన భర్త బెనడిక్ట్‌ టేలర్‌ తో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ.. బికినిలో కనిపించింది. దీంతో నెటిజన్స్ ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఆ కామెంట్స్ పై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న రాధికా ఇటీవల మీడియా సమావేశంలో నోరు విప్పక తప్పలేదు. అందుకు సంబందించిన ప్రశ్న ఎదురవ్వడంతో స్పందించింది. కామెంట్ చేసిన వారు ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటప్పుడు ఎందుకు స్పందించాలి. నేను ఆ విషయం గురించి మాట్లాడాను. అయినా బికినీలో కనిపిస్తే తప్పేంటి?. బీచ్ లో చీర కట్టుకోవాలా ఏంటి? అని రాధికా ఒక్కసారిగా కోపాన్ని వ్యక్తం చేసింది.