హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన రాధికా ఆప్టే ?

Sunday, April 15th, 2018, 05:22:18 PM IST


సినిమాల్లో హీరోయిన్ గా కంటే కూడా .. వివాదాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న రాధికా ఆప్టే హాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత లిడియా డీన్ దర్శకుడిగా మరి తెరకెక్కించే సినిమాలో రాధికా ఆప్టే ని కీలక పాత్రలో ఎంపిక చేశారట. పలువురు హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో రాధికా కీ రోల్ లో ఛాన్స్ కొట్టేయడం అందరిని ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాలో రాధికా బ్రిటిష్ ఇంటిలిజెన్స్ అధికారిగా కనిపిస్తుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి. నటిగా నిరూపించుకునేందుకు న్యూడ్ గా సైతం తన సత్తా చాటిన రాధికా ఆప్టే హాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.