మరో సంచలనానికి రెడీ అయిన … రాధికా ఆప్టే ?

Wednesday, November 30th, 2016, 11:42:11 AM IST

radhika-apte
రాధికా ఆప్టే … ఈ పేరు వింటే చాలు .. ఆమె రేపే సంచలనాలే గుర్తుకు వస్తాయి!! ఇప్పటికే న్యూడ్, సెమి న్యూడ్ అంటూ హంగామా క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రాధికా ఆప్టే .. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, మరాఠి, తమిళ సినిమాల్లో నటిస్తుంది. కమర్షియల్ హీరోయిన్ గా వెలుగుదామనుకున్న ఈ భామకు ఆ ఛాన్స్ దక్కలేదు .. దాంతో నటిగా నిరూపించుకునేందుకు బోల్డ్ కాన్సెప్ట్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంది, ఇటీవలే ‘పర్చెడ్’, ‘మ్యాడ్లి’ అనే సినిమాలో ఆమె నటించిన సీన్స్ లీకయి పెద్ద దుమారమే రేపింది. తాజాగా మరో దుమారానికి రెడీ అయిందట రాధికా. ఈ రెండు సినిమాల సీన్స్ లీకయినా రాధికా పెద్దగా ఫీల్ కాలేదు .. దానికి తోడు బోలెడంత పబ్లిసిటీ దక్కింది, తనపై తనకు చాలా కాన్ఫిడెంట్ ఉందంటున్న ఈ భామ తాజాగా ”బొంబైరియా” అనే సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది? ఈ సినిమాలో ఓ స్టార్ హీరోతో సన్నిహితంగా, అతని విషయాలు చూసుకునే పాత్రలో కనిపిస్తుందని, ఆమెకు, హీరోకి మధ్య నడిచే వ్యక్తిగత విషయాలపై ఈ సినిమా ఉంటుందట, అతనితో రొమాన్స్ చేస్తున్న సన్నివేశాలు ఫోన్ లో ఉంటాయని, ఆ ఫోన్ ను ఓ దొంగ దొంగిలిస్తాడట, అందులో ఉన్న ఆ వీడియొ లు లీక్ అయితే ఎలా ఉంటుంది అన్న కథతో ఈ సినిమా నడుస్తుందట!! అంటే ఈ సినిమాలో కూడా రాధికా ఆప్టే బోల్డ్, అండ్ బెడ్ సీన్స్ చాలానే ఉంటాయట !! మరి ఈ సినిమాతో ఈ అమ్మడు ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి.