మళ్ళీ సౌత్ హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ ?

Wednesday, March 21st, 2018, 10:59:12 AM IST

ఇప్పటికే పలు సంచలనాలతో ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ రాధికా ఆప్టే మరోసారి సౌత్ హీరోలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలుమార్లు సౌత్ సినిమాలపై ఘాటు వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేపిన ఈ అమ్మడు తాజాగా సౌత్ హీరోలపై పడింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ నేను సౌత్ లో హీరోయిన్ గా కూడా చేశాను. అక్కడ హీరోలదే రాజ్యం. హీరోలకు మంచి క్రేజ్ ఉంటుంది. వాళ్ళు చాలా పవర్ ఫుల్ అని, హీరోయిన్స్ విషయంలో వాళ్ళ ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. పారితోషికం బాగానే ఇస్తారు కానీ దానికి తగ్గ కష్టం కూడా ఉంటుంది. ఇక హీరోల కంటే రెండు గంటల ముందే సెట్స్ కు రావాల్సి ఉంటుందని, హీరోలు వచ్చే వరకు ఎదురుచూస్తూ కూర్చోవాలని చెప్పింది రాధికా ఆప్టే, హిందీలో నేహా ధూపియా హోస్ట్ గా చేస్తున్న నో ఫిల్టర్ అనే కార్యక్రమంలో పాల్గొన్న రాధికా ఇలా సౌత్ హీరోలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. రక్త చరిత్ర, లయన్, లెజెండ్, వంటి సినిమాల్లో నటించిన ఈ అమ్మడు హిందీలో ఓ సినిమాకోసం ఏకంగా న్యూడ్ గా నటించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.