సినిమాల్లో సీఎం సతీమణి!

Saturday, September 8th, 2018, 05:50:16 PM IST

కొన్ని నెలల కిందట కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఒక్కసారిగా దేశాన్ని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా జేడీఎస్ – కాంగ్రెస్ కూటమిలో కుమారస్వామి సీఎం పదవిని అందుకొని అయన కూడా దేశాన్ని ఆకర్షించాడు. అయితే కుమారస్వామితో పాటు అతని రెండవ భార్య రాధికా కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కుమారస్వామి భార్య ఎంత అందంగా ఉందొ చుడండి అంటూ యూట్యూబ్ లో అనేక కథనాలు వెలువడ్డాయి.

అసలు విషయానికి వస్తే ఆమె ఇప్పుడు వెండితెరపై మెరవబోతున్నట్లు తెలుస్తోంది. అదికూడా టాలీవుడ్ సినిమా కావడంతో ఇంకాస్త వైరల్ అయ్యింది. అసలైతే రాధిక మొదట ఒక నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసింది. తారకరత్న భద్రాద్రి రాముడు సినిమాలో హీరోయిన్ గా మెరిసి ఆ తరువాత కుమారస్వామిని పెళ్లాడింది. కూతురు జన్మించిన తరువాత ఆమె సినిమాలను కాస్త పక్కనపెట్టింది. ఇక ఇప్పుడు కాంట్రాక్ట్ అనే తెలుగు సినిమాలో రాధికా నటించడానికి ఒప్పుకుంది. అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఆ సినిమాలో జెడి చక్రవర్తి విలన్ గా నటించనున్నాడు. తమిళ్ కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా తెరకెక్కనుందట. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో సీఎం సతీమణి జనాలను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments