వైజాగ్‌లో ర్యాడిస‌న్ హోట‌ల్స్‌, క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌!?

Thursday, March 1st, 2018, 09:26:05 PM IST

బీచ్ సొగ‌సుల వైజాగ్ హైద‌రాబాద్‌లాగా మెట్రో న‌గ‌రంగా అల‌రార‌బోతోందా? హైద‌రాబాద్ త‌ర‌హాలోనే 5స్టార్- 7 స్టార్‌ హోట‌ల్స్‌, క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ తో క‌ళ‌క‌ళ‌లాడ‌బోతోందా? అంటే అవున‌నే స‌మాచారం. మొన్న జ‌రిగిన సీఐఐ- పారిశ్రామిక వేత్త‌ల స‌ద‌స్సులో ఆ మేర‌కు విశాఖ న‌గ‌రానికి రెండు 7స్టార్ హోట‌ల్స్‌ని శాంక్ష‌న్ చేశారు. అంతేకాదు హైద‌రాబాద్ హైటెక్స్‌-నోవాటెల్ త‌ర‌హాలో భారీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను ప్రారంభించ‌నున్నారు. విశాఖ‌లో ఐటీ హ‌బ్‌గా పేరుగాంచిన మ‌ధుర‌వాడ‌లో రెండు స్టార్ హోట‌ళ్ల నిర్మాణానికి శంకుస్థాప‌న‌లు సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే చేయ‌నున్నారు. ప్ర‌ఖ్యాత పారిశ్రామిక వేత్త‌లు వీటి కోసం భారీ మొత్తాల్ని వెచ్చించ‌నున్నారు. ఇక‌పోతే వైజాగ్‌కి క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ పేరుతో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ తీసుకురావ‌డం ద్వారా వ‌ర‌ల్డ్ ఐటీ కేంద్రాల్ని అటువైపు ఆక‌ర్షించాల‌న్న ప్ర‌తిపాద‌న తెచ్చార‌ని తెలుస్తోంది.

విశాఖ న‌గ‌రాన్ని ఐటీ హ‌బ్‌గా డెవ‌ల‌ప్ చేయ‌డ‌మే ధ్యేయంగా పావులు క‌దుపుతున్నారు. ఇక ఇదే చోట ఫిలింఇండ‌స్ట్రీ ఏర్పాటు గురించిన ఓ ర‌హ‌స్య స‌మావేశం ఇటీవ‌ల జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఈ స‌న్నివేశం అంతా చూస్తుంటే.. వైజాగ్‌ని హైద‌రాబాద్‌లా మార్చేందుకు హైటెక్ చంద్ర బాబు చాలానే ప్లాన్ వేశార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సులో దాదాపు 10వేల కోట్ల మేర ఒప్పందాలు సాగిన సంగ‌తి తెలిసిందే. ఇవ‌న్నీ ఫ‌ల‌వంతం కావ‌డానికి కేవ‌లం కొన్ని నెల‌లు మాత్ర‌మే ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ఈ స‌ద‌స్సులో విశాఖ న‌గ‌రంపై వేల కోట్ల పెట్టుబ‌డులు వెద‌జ‌ల్లేందుకు ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు ఆస‌క్తి క‌న‌బ‌రచ‌డం ఆస‌క్తి రేకెత్తించింది. మ‌రోవైపు విశాఖ న‌గ‌రం మొత్తాన్ని క‌వ‌ర్ చేసేలా 45 కిలోమీట‌ర్ల మేర మెట్రో రైల్‌ని ప్ర‌తిపాదించ‌డం సంచ‌ల‌న‌మైంది. ఆరంభం నాలుగు లేన్ల‌లో మెట్రో రైల్ నిర్మాణాలు చేప‌ట్టేందుకు ఫైల్ వేగంగా క‌దులుతోంద‌ని తెలుస్తోంది.