యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్ విజేత నాదల్

Tuesday, September 10th, 2013, 01:28:39 PM IST

Rafael-Nadal-beats-Novak-Dj
యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌ లో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ విజయ నాదం చేశాడు. యుఎస్ ఓపెన్ ఫైనల్లో రఫెల్ నాదల్ నెంబర్ వన్ నోవాక్ జకోవిచ్‌ను 6-2, 3-6, 6-4, 6-1 స్కోరుతో గెలిచాడు. ఇరువురి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. 27 ఏళ్ల నాదల్ 2010లో ఓసారి, ఇప్పుడు యుఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. అతను ఈ సీజన్‌లో వరుసగా పది టైటిళ్లు గెలుచుకున్నాడు. మొత్తం 60 విజయాలు సాధించి, మూడు మాత్రమే ఓడిపోయాడు. సోమవారంనాటి విజయం వల్ల అతనికి 3.6 మిలియన్ డాలర్లు దక్కుతాయి. ఇది అత్యంత ఉద్వేగపూరితమైందని, ఇది తనకు ఎంత అవసరమో తన సభ్యులందరికీ తెలుసునని నాదల్ అన్నాడు. నోవాక్ ఎల్లవేళలా తన ఆటను పరిమితం చేస్తాడని, అతను అద్భుతమైన ఆటగాడని, క్రీడల్లో అత్యంత గొప్ప ఆటగాళ్లలో అతను ఒక్కడని నాదల్ అన్నాడు. రఫెల్ నాదల్ బాగా ఆడాడని, విజయానికి అర్హుడని నోవాక్ జకోవిచ్ అన్నాడు. ఈ మ్యాచులో ఓడిపోవడం తనను అసంతృప్తికి గురి చేసిందని, అయితే, ట్రోఫీ కోసం పోరాడే గౌరవం దక్కిందని ఆయన అన్నాడు.