అభిమాని మరణంతో సంచలన నిర్ణయం తీసుకున్న లారెన్స్ !

Monday, February 5th, 2018, 12:46:47 PM IST

అభిమాన హీరో వస్తున్నాడంటే చాలు ఫ్యాన్స్ ఏ రేంజ్ ఉత్సాహం చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారితో ఒక్క ఫొటో అయినా దిగాలని చాలా ఆశపడుతుంటారు. అయితే రీసెంట్ గా అదే ఆనందంతో ఒక అభిమాని హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తో ఫొటో దిగాలని వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. ప్రాణాలు కోల్పోవడంతో లారెన్స్ ఊహించని విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అభిమానులు తనతో ఫొటో దిగకూడదని నా కోసం రావద్దని చెబుతూ.. నేనే మీ దగ్గరికి వస్తానని సోషల్ మీడియా ద్వారా చెప్పాడు.

రీసెంట్ గా శేఖర్ అనే అభిమాని. నాతో ఫొటో దిగాలని వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని అంత్యక్రియల్లో నేను పాల్గొన్నాను. అది నన్ను చాలా బాధకు గురి చేసింది. అయితే ఇక నుంచి ఏ అభిమానికి అలా జరగకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నన్ను కలవాలని అనుకునే అభిమానులు ఎవరు నా దగ్గరికి రాకూడదు. నేనే మీ దగ్గరికి వస్తాను. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తప్పకుండా అభిమానులు ఉండే చోటుకు నేను వస్తాను. ముందుగా ఈ నెల 7న సేలం కు రాబోతున్నా. శేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు లారెన్స్ పేర్కొన్నాడు.