స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాలయ్య .. పర్యవేక్షణ మాత్రం ?

Tuesday, May 1st, 2018, 09:27:44 AM IST

నందమూరి బాలకృష్ణ ఎప్పుడైతే ఎన్టీఆర్ బయోపిక్ ను ఎప్పుడైతే మొదలు పెట్టాడో .. అప్పటినుండి ఈ సినిమాకు ఆటంకాలు వస్తూనే ఉన్నాయ్. తాజాగా ఈ సినిమా నుండి దర్శకుడు తేజ తప్పుకోవడంతో అసలు సమస్య మొదలైంది. నందమూరి అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ ని ఎలాగైనా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు బాలయ్య. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాలో బాలయ్య 53 గెటప్స్ లో కనిపిస్తాడట. ఈ సినిమాకోసం క్రిష్ పేరు వినిపిస్తుంది. అయితే క్రిష్ వేరే ప్రాజెక్ట్స్ విషయంలో బిజీగా ఉండడంతో అయన చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే ఈ సినిమా విషయంలో దర్శకేంద్రుడి సపోర్ట్ తీసుకోవాలని భావిస్తున్నాడట. అంటే రాఘవేంద్రుడి పర్యవేక్షణలో బాలయ్య దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ విషయం గురించి త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.