సంక్షేమపధకాలకు బాబు గండి

Tuesday, September 30th, 2014, 12:53:19 PM IST


సంక్షేమ పధకాలకు ఆధార్ ను లింక్ పెట్టడం సరికాదని.. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమపదకాలకు ఆధార్ ను లింక్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేసే పధకాలకు ఆధార్ తప్పని సరి కాదని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

సుప్రీం కోర్టు తీర్పును చంద్రబాబు నాయుడు ఖాతరు చేయడంలేదని ఆయన తెలిపారు. గతంలో ఆధార్ ను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడే ఇప్పుడు ఆధార్ ను లింక్ చేయడం విడ్డూరంగా ఉన్నదని ఆయన అన్నారు. రుణాల మాఫీకి 87వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని.. కాని, ప్రభుత్వం 7వేల కోట్ల రూపాయలు మాత్రమే రీషెడ్యూల్ చేస్తామంటే.. ఎలా అని ఆయన ప్రశ్నించారు. 13నుంచి 14లక్షల పించన్లపై కోత విధించబోతున్నట్టు సమాచారం అందుతున్నదని ఆయన అన్నారు.