చంద్రబాబు టోపీ పెట్టారు

Monday, September 15th, 2014, 04:08:05 PM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద రోజుల పరిపాలనపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డితయారు చేసిన వాస్తవ పత్రాన్ని సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు టోపీ పెట్టారని తీవ్రంగా విమర్శించారు. అలాగే చంద్రబాబు వంద రోజుల పాలనలో నూటొక్క అబద్దాలు ఆడారని రఘువీరా ధ్వజమెత్తారు. ఆయన ఇంకా మాట్లాడుతూ మంత్రివర్గంలో పెట్టుబడిదారులకే బాబు చోటు కల్పించారని ఎద్దేవా చేశారు. అలాగే వంద రోజుల్లో సిమెంట్ ధర వంద రూపాయలు పెంచారని రఘువీరా పేర్కొన్నారు. ఇక చంద్రబాబు మంత్రివర్గ సమావేశాలను దిగజార్చారని రఘువీరా రెడ్డి ధ్వజమెత్తారు.