వాక్సినేషన్ ప్రక్రియ పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Wednesday, April 7th, 2021, 02:45:57 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గత రెండు రోజులు గా లక్ష కి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఈ కేసుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది కానీ, ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే కరోనా ను కట్టడి చేసే వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది. దేశం లో రోజుకి 20 లక్షల మందికి పైగా కరోనా వాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. అయితే తాజాగా ఈ కరోనా వైరస్ వాక్సినేషన్ ప్రక్రియ పై ప్రతి పక్ష నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే 18 ఏళ్లు నిండిన వారందరికీ కూడా వాక్సిన్ ఇవ్వాలి అంటూ ఒక పక్క చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎవరికి అవసరమో వారికి మాత్రమే ఇవ్వాలని, అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు అని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ ఈ చర్చల పట్ల స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వాక్సిన్ నీడ్స్, వాంట్స్ మాటల పై చర్చలు హాస్యాస్పదం అంటూ విమర్శలు చేశారు. ఎవరికి అవసరమో గుర్తించే సరికి సమయం పడుతుంది అని అన్నారు. అయితే మన దేశం లో రోజుకి 20 లక్షల మందికి పైగా కరోనా వైరస్ వాక్సిన్ అందిస్తుండగా, అమెరికా లో రోజుకి 30 లక్షల మందికి పైగా వాక్సిన్ అందిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అమెరికా లో 112 రోజుల్లో 16 కోట్ల మందికి వాక్సిన్ అందించగా, ఇండియా లో 79 రోజుల్లో 8 కోట్ల మందికి వాక్సిన్ అందించినట్లు తెలిపారు.