మోడీ పై ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ… ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోము!

Friday, October 18th, 2019, 11:22:20 AM IST

భారతదేశం లో పెను మార్పులు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని నరేంద్ర మోడీ ఫై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి సంబందించిన కార్పొరేషన్ వ్యవస్థలను ప్రైవేట్ పరం చేయడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. అంతే కాకుండా దానికి సంబంధించినటువంటి ఒక చిత్రాన్ని జత చేస్తూ మోడీ తీరు ని వివరించారు రాహుల్ గాంధీ. సూటు బూటు వేసుకున్న తన స్నేహితులకు మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారు అని ఆరోపించారు.

ప్రభుత్వ రంగ సంస్థలకు ఎప్పటికైనా ప్రభుత్వమే అండగా నిలవాలి, కానీ వాటినే నమ్ముకొని బతుకుతున్నటువంటి కొన్ని లక్షల మంది ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ ఉంటే చూస్తూ వూరుకుంటామా? సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోము అని అన్నారు. మోడీ ని బచేంద్ర మోడీ అని సంబోధించారు రాహుల్ గాంధీ. ప్రైవేట్ పరం కాకుండా ప్రజలకు అండగా మేముంటామని పేర్కొన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల నేపథ్యం లో రాహుల్ ఇలా మాట్లాడుతన్నారని అర్ధం అవుతుంది. ప్రజల తరపున ఉండాల్సిన నరేంద్ర మోడీ, పారిశ్రామిక వేత్తల వైపు మాట్లాడుతన్నారని అన్నారు.