న్యూ లుక్ తో షాకిచ్చిన రాజ్ తరుణ్!

Tuesday, July 24th, 2018, 12:54:42 PM IST

తిరుపతిలో వెంకన్న స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మంచి కార్యం కోసం సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు అందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అలవాటే. ఇకపోతే ఇటీవల లవర్ సినిమాతో కాస్త పికప్ అయిన రాజ్ తరుణ్ కూడా అందరి లాగే వెంకన్నను దర్శించుకున్నాడు. అయితే మొక్కు నిమిత్తం తలనీలాలు కూడా సమర్పించుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు. తిరుపతి దేవస్థానంలో మొదట ఎవరు రాజ్ తరుణ్ ని గుర్తించలేదు. అయితే హడావుడి ఎక్కువగా అనిపించడంతో ఒక్కసారిగా అందరూ రాజ్ తరుణ్ ని చూసి ఫొటోలు దిగారు. ఈ యువ హీరో కూడా అభిమానులను ఆప్యాయంగా కలుసుకున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments