కోలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ లో రాజ్ తరుణ్ ?

Sunday, June 3rd, 2018, 05:32:13 PM IST

యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం గడ్డు కాలమే ఎదుర్కొంటున్నాడు అని చెప్పుకోవాలి. మొదటి చిత్రం ఉయ్యాల జంపాల, తర్వాత సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్, ఆడోరకం ఈడోరకం చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న రాజ్ తరుణ్ తరువాత వరుసగా ప్లాప్ లను చవిచూస్తున్నారు. ఇటీవల విడుదలయిన రాజుగాడు కూడా ఒకమోస్తరు టాక్ తో రన్ అవుతోంది. కాగా ప్రస్తుతం రాజ్ తరుణ్ ఒక సూపర్ హిట్ కోలీవుడ్ సూపర్ హిట్ రేమేక మూవీలో నటిస్తున్నట్లు సమాచారమా అందుతోంది. కోలీవుడ్ లో నయనతార, విజయ్ సేతుపతి జంటగా రాధికా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నానుమ్ రౌడీదా’. 2015లో తమిళ్ లో విడుదలయిన ఈ చిత్రం అప్పట్లో అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ చిత్రాన్ని నేను రౌడీనే పేరుతో నిర్మాత సి కళ్యాణ్ తెలుగులోకి అనువదించి విడుదల కూడా చేసారు. కానీ ఆ చిత్రం తెలుగులో ఘోర పరాజయం పాలయింది. అయితే ప్రస్తుతం ఇదే చిత్రాన్ని యంగ్ హీరో రాజ్ తరుణ్ తో రీమేక్ చేయనున్నారట సి కళ్యాణ్.

ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ మేరకు నిర్మాత కళ్యాణ్, రాజ్ తరుణ్ కు విషయం చెప్పి రీమేక్ లో నటించేందుకు ఒప్పించారని, అతి త్వరలోనే ఈ చిత్రంలోని ఇతర నటీనటుల ఎంపిక ప్రారంభవుతుందని, అంతే కాకా దీని తాలూకు అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుందట. అయితే విజయ్ సేతుపతి ఈ చిత్రంలో రౌడీగా నటించాడు, నయనతార ఒక చెవిటి పాత్రలో నటించింది. కాగా వారిద్దరి పాత్రలు ఒకరకంగా ఛాలెంజింగ్ గానే ఉంటాయి. కనుక తెలుగులో రాజ్ తరుణ్, అలానే తీసుకోబోయే హీరోయిన్ ఆ పాత్రలకు ఏ మేరకు న్యాయం చేస్తారో వేచి చూడాలిమరి….

  •  
  •  
  •  
  •  

Comments