ఈ సారి రీమేక్ నే నమ్ముకున్న రాజ్ తరుణ్ ?

Wednesday, June 13th, 2018, 02:05:41 AM IST

రాజ్ తరుణ్ నటిస్తున్న సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఈ విషయంలో రాజ్ తరుణ్ నటనలో .. బాడీ లాంగ్వేజ్ లో ఎలాంటి కొత్తదనం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజుగాడు కూడా అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఈ సారి మంచి హిట్ కొట్టాలన్న ఆలోచనలో భాగంగా తమిళ సూపర్ హిట్ రీమేక్ ని నమ్ముకున్నాడు. దాంతో పాటు తనకు హిట్ పెయిర్ గా నిలిచిన హెబ్బా పటేల్ తో జోడి కడుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే తమిళంలో విజయ్ సేతుపతి , నయనతార జంటగా వచ్చిన నానుమ్ రౌడీ దాన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తారట, ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని తెలిసింది. మరి ఈ సినిమాతో అటు చేతిలో సినిమాలు లేవు, ఇటు వరుస పరాజయాలతో టెన్షన్ పడుతున్న హెబ్బా పటేల్ కు కూడా సరైన విజయం కావాలి .. కాబట్టి ఈ సినిమా ఈ ఇద్దరికీ ముఖ్యమే.

  •  
  •  
  •  
  •  

Comments