రాజ్ తరుణ్ రెమ్యూనరేషన్ తగ్గించాడు ?

Sunday, June 10th, 2018, 01:22:14 AM IST

ఉయ్యాలా జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ఇప్పటికే క్రేజ్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ కు ఈ మధ్య వరుస పరాజయాలు అందుతున్నాయి. దానికి తోడు .. రాజ్ తరుణ్ నటనలోనూ రొటీన్ గా బోర్ కొట్టేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. దాంతో రాజ్ తరుణ్ కు అవకాశాలు రావడం లేదు. తాజగా చేసిన రాజుగాడు కూడా ప్లాప్ అవ్వడంతో కొత్త ఛాన్సులు ముఖం చాటేస్తున్నాయి. దాంతో మనోడు రెమ్యూనరేషన్ బాగా తగ్గించాడట. కొత్తగా వస్తున్నా దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నాడట. ఇక ఇక పెద్ద దర్శకులు అయితే కనీసం రాజ్ తరుణ్ దగ్గరికి రావడం లేదు .. మరి రెమ్యూనరేషన్ తగ్గించుకున్న రాజ్ తరుణ్ కు కొత్త అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.