చరణ్ టైటిల్ రాజా మార్తాండా కాదట ?

Tuesday, May 1st, 2018, 01:19:12 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రెండో షెడ్యూల్ జోరుగా జరుపుకుంటుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఖైరా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు రాజా మార్తాండా, రాజా వంశస్తుడు అనే టైటిల్స్ పెడతారంటూ తెగ ప్రచారం జరుగుతున్నా విషయం తెలిసిందే. ముక్యంగా రాజా మార్తాండా అనే టైటిల్ ఖరారుకి చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఈ సినిమాకు ప్రస్తుతం ప్రచారంలో ఉన్న టైటిల్స్ పెట్టడం లేదని యూనిట్ తెలిపింది. త్వరలొనె ఈ సినిమాకు సంబందించిన టైటిల్ తో కూడా ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారట. మరి ఈ సినిమాకు ఇంకే టైటిల్ పెడతారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments