షాకిస్తున్న రాజా ప్రీరిలీజ్ బిజినెస్‌! రాజా ప్రీరిలీజ్ బిజినెస్ 45 కోట్లు?

Wednesday, October 18th, 2017, 11:13:21 AM IST

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ కెరీర్‌లో బాగా గ్యాప్ ఇచ్చి న‌టించిన సినిమాగా `రాజా ది గ్రేట్` పాపుల‌రైంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత ర‌వితేజ మ‌ళ్లీ అభిమానుల ముందుకు వ‌స్తున్నాడు. అయితే ఇంత గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్నాడు కాబ‌ట్టి మాస్ రాజా అభిమానుల్లో కాస్తంత ఆస‌క్తి నెల‌కొంది. ప‌టాస్, సుప్రీం లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని తెర‌కెక్కించిన అనీల్ రావిపూడి .. ఈ ఏడాది వ‌రుస విజ‌యాల‌తో ఖుషీ మీద ఉన్న దిల్ రాజు కాంబినేష‌న్‌లో ఈ సినిమా వ‌స్తోంది కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టే రిలీజ్ ముందే భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే దాదాపు 45 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ జ‌రిగింద‌ని తెలుస్తోంది. ర‌వితేజ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగానూ చెబుతున్నారు.

రాజా ది గ్రేట్ ఈ గురువారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ స్క్రీన్ల‌లో రిలీజ‌వుతోంది. కేవ‌లం అమెరికాలో 100 పైగా లొకేష‌న్ల‌లో .. వంద‌లాది స్క్రీన్ల‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే అమెరికాలో ప్రీమియ‌ర్ షోల‌కు టిక్కెట్ల అమ్మ‌కం జోరుగా సాగింది. అక్కడ భారీ వ‌సూళ్లే ల‌క్ష్యంగా.. ఒక టికెట్ కొంటే ఒక‌టి ఫ్రీ అంటూ ఆఫ‌ర్ పెట్టి మ‌రీ టిక్కెట్లు విక్ర‌యించారుట‌. దీంతో అమెరికా ప్రీమియ‌ర్లు క‌లుపుకుని తొలి వీకెండ్ భారీ వ‌సూళ్లు సాధించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇక‌పోతే నిన్న‌నే హైద‌రాబాద్ లో ప్రీమియ‌ర్ వీక్షించిన కొంద‌రు సినీప్ర‌ముఖులు రాజా ది గ్రేట్ హిట్ అంటూ మౌత్ టాక్ స్ప్రెడ్ చేశారు. నిర్మాత దిల్ రాజు ప్రీమియ‌ర్ చూసిన త‌ర్వాత చాలా సంతృప్తిగా క‌నిపించారుట‌. అంతేనా.. ప్రివ్యూ అనంత‌రం.. చిత్ర బృందం 10,000 వాలాను అంటించి ర‌చ్చ‌ర‌చ్చ చేసిందిట‌. రెండ్రోజుల ముంద‌ దీపావ‌ళిని సెల‌బ్రేట్ చేసుకుని హ్యాపీ మూడ్‌లోకి వెళ్లిపోయారుట‌. శ‌త‌మానం భ‌వ‌తి, నేనులోక‌ల్‌, డీజే, ఫిదా వంటి సంచ‌ల‌న విజ‌యాలతో సంతోషంగా ఉన్న దిల్ రాజు .. మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ ఖాతాలో వేసుకున్నాన‌న్న ధీమాని క‌న‌బ‌రిచారుట‌. అయితే ప్రీరిలీజ్ బిజినెస్ మేర‌కు వ‌సూళ్లు సాధించాలంటే 45 కోట్ల మేర షేర్ రాబ‌ట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఈ సినిమా హిట్టు కింద లెక్క‌. చూద్దాం.. రాజా వ‌సూళ్ల దూకుడు ఎలా ఉండ‌బోతోందో?