త్రివిక్రమ్ అడిగితె చేసేవాడిని అంటున్న రాజశేఖర్ ?

Sunday, November 12th, 2017, 12:55:13 AM IST

కొంత గ్యాప్ తరువాత హీరో రాజశేఖర్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. అయన నటించిన గరుడ వేగ సినిమా ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్ తో రన్ అవుతుంది. ఈ సినిమా తరువాత రాజశేఖర్ కు చాలా అవకాశాలు వస్తున్నాయి కూడా. ఈ సినిమాకు ముందు రాజశేఖర్ కు విలన్ పాత్రలు చేయమంటూ చాలా అవకాశాలు వచ్చాయి, అందులో కొన్ని సినిమాలను రాజశేఖర్ చేయనని చెప్పాడు. మరికొన్ని సినిమాల్లో పాత్రలు వస్తాయని ఆశపడ్డాడు .. ఆ పాత్రలు వస్తే చేయడానికి రెడీ అయ్యాడు .. కానీ ఎవరు ఆ పాత్ర చేయమని అడగలేదని ఓ సందర్బంగా చెప్పాడు రాజశేఖర్? అవునా అయన ఆశపడ్డ పాత్ర ఏమిటో తెలుసా .. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర చేసిన పాత్ర !! ఆ పాత్రకోసం త్రివిక్రమ్ రాజశేఖర్ ను ముందే అనుకున్నాడట . కానీ ఎందుకనో రాజశేఖర్ ను అడగకుండా ఉపేంద్ర ను ఎంపిక చేసాడట. నిజానికి త్రివిక్రమ్ తనను అడిగివుంటే తప్పకుండా చేసేవాడిని అని చెప్పాడు రాజా శేఖర్, తాజాగా ఈ విషయం పై అయన ఓ సందర్బంగా తెలిపాడు.

  •  
  •  
  •  
  •  

Comments