అన్నీ ఆంధ్రావాళ్ళకే దోచి పెట్టారు!

Saturday, September 13th, 2014, 03:59:09 PM IST


తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్య శనివారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. అటుపై టిపిసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై విరుచుకుపడుతూ మంత్రిగా ఉన్నప్పుడు పొన్నాల ఆంధ్రాకే ఎక్కువ న్యాయం చేశారని దుయ్యబట్టారు. ఇక నీళ్ళు, నిధులను పొన్నాల ఆంధ్రావాళ్లకు దోచిపెట్టారని రాజయ్య తీవ్రంగా ఆరోపించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు భూములు పంచనున్నదని తెలిపారు. అలాగే గత ప్రభుత్వం వేల కోట్లను ఖర్చు చేసి తెలంగాణలో ఎకరం పొలం కూడా సాగులోకి తేలేదని రాజయ్య ఎద్దేవా చేశారు. ఇక హెల్త్ యూనివర్సిటీకి వరంగల్ లో ఎక్కువ భూములున్నాయని మంత్రి తెలిపారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు తండ్రిలాంటి వారని, ఆయన తనపై చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా చూడొద్దని రాజయ్య విజ్ఞ్యప్తి చేశారు.