ఆ లేఖ నేను రాయ‌లే! అదంతా శాత‌క‌ర్ణి టీమ్ అత్యుత్సాహం!.రాజ‌మౌళి

Saturday, January 28th, 2017, 01:40:38 PM IST

ss-rajamouli
ఆరోజు డెయిలీ పేప‌ర్‌లో వ‌చ్చిన లేఖ చ‌దివారు క‌దూ.. అది రాసింది నేను కాదు. అదంతా శాత‌క‌ర్ణి టీమ్ అత్యుత్సాహం.. ఆ మాట క్రిష్‌నే చెప్పాడు.. అంటూ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కొత్త కాంట్ర‌వ‌ర్శీకి తెర‌తీశారు. శాత‌క‌ర్ణి టీమ్ చేసిన అత్యుత్సాహం, ఓవ‌రాక్ష‌న్‌ని ట్విట్ట‌ర్ సాక్షిగా ప్ర‌శ్నించాడు. రాజ‌మౌళి ట్విట్ట‌ర్‌లో ఏమ‌న్నాడంటే..

“అస‌లు ఆ డెయిలీలో లేఖ రాసింది నేను కాదు. అందులోని అక్ష‌రాలు నేను లిఖించిన‌వి కావు.. లేఖ అంతా ఓవ‌ర్ డ్ర‌మ‌టైజేష‌న్‌.. అంటూ కొట్టిపారేశాడు. అంతేనా? ఇదంతా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి టీమ్ ఓవ‌రాక్ష‌న్ అంటూ క్రిష్ త‌న‌తో అన్నార‌ని గాలి తీసేశారు. వాస్త‌వానికి త‌న‌ని ఇంట‌ర్వ్యూ చేయాల్సిందిగా క్రిష్ అభ్య‌ర్థిస్తే, నిజాయితీగా శాత‌క‌ర్ణి న‌చ్చింది కాబ‌ట్టి అందుకు ఓకే చెప్పాను.. దానివ‌ల్ల ఇలాంటి మంచి సినిమాకి వ‌సూళ్ల‌లో మైలేజ్ పెరుగుతుంద‌ని ముందుకొచ్చా. కానీ అదే టీవీ ఇంట‌ర్వ్యూని నేను స్వ‌యంగా లేఖ రాసిన‌ట్టుగా డెయిలీ పేప‌ర్లో రావ‌డంతో షాక్ తిన్నా. దానిపై శాత‌క‌ర్ణి టీమ్‌నుంచి క్లారిటీ వ‌స్తుంద‌నుకున్నా. కానీ ఏ క్లారిటీ లేదని జ‌క్క‌న్న అన్నారు.