మ్యాటర్ నాదే..లెటర్ నాది కాదు – రాజమౌళి

Thursday, January 26th, 2017, 04:32:56 PM IST

rajmouli
గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది.ఈ చిత్రం పై రాజమౌలి ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ చిత్ర దర్శకుడు క్రిష్ ని ప్రత్యేకంగా అభినందించారు.కాగా ఈ చిత్ర విజయం పై రాజమౌళి క్రిష్ ని ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూ ఛానళ్లలో ప్రసారం అయింది. అలాగే ఈ చిత్రం పై ఇంటర్వ్యూ లో రాజమౌళి కురిపించిన ప్రశంసలను రాజమౌళి రాసిన లేఖ గా చిత్రీకరించి ప్రింట్ మీడియాలలో పబ్లిష్ చేశారు.

ఇలా జరగడంపై రాజమౌళి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు.ఆ లెటర్ లో అత్యుత్సాహాన్నిప్రదర్శించారని రాజమౌళి అన్నారు. కాగా తాను ఆ లెటర్ ని రాయలేదని రాజమౌళి అన్నారు.దీనిగురించి క్రిష్ ని తాను అడిగానని రాజమోళి తెలిపాడు. తమ యూనిట్ అత్యుత్సాహం వల్ల అలా జరిగిందని క్రిష్ రాజమౌళికి వివరణ ఇచ్చినట్లు తెలిపాడు.