ధోని కోసం రానున్న దర్శక ధీరుడు..!

Friday, September 23rd, 2016, 11:18:02 PM IST

dhoni-and-rajmouli
దర్శక ధీరుడు రాజమౌళి, భారత పరిమిత ఓవర్ ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒకే వేదిక పై కలుసుకోబోతున్నారు.ఈ అపురూపట్టం శనివారం జరగనుంది.శనివారం మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎం ఎస్ ధోని- ది అన్ టోల్డ్ స్టోరీ చిత్ర ఆడియో వేడుక హైదరాబాద్ లో జరగనుంది. ఈ చిత్రం లో ధోని పాత్రని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోషించాడు. ఆడియో వేడుకని శనివారం జెఆర్సీ కన్వేషన్ సెంటర్ లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మరాఠి భాషల్లో విడుదలచేయనున్నారు. ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. ఈ నెల 30 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.