ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ఆగిపోతుందా..ఆలస్యమవుతుందా..?

Monday, January 15th, 2018, 09:15:09 PM IST

అజ్ఞాతవాసి చిత్రం పరాజయంతో ఇబ్బందుల్లో ఉన్న త్రివిక్రమ్ కు మరో దెబ్బ తగిలేలా ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో ఉండనున్న సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం పై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీనికి కారణం అజ్ఞాతవాసి చిత్రం కాదని సినీవర్గాలు చెబుతున్నాయి. కాకపోతే ఎన్టీఆర్ కోసం ఇప్పటికే దర్శక ధీరుడి రాజమౌళి వేచి చూస్తున్నాడు.

రాజమౌళి సినిమా అంటే హీరో మరో సినిమా చేసే అవకాశం ఉండదు. డేట్స్ పూర్తిగా ఆ చిత్రానికే కేటాయించాల్సి ఉంటుంది. అలా ఉంటుంది రాజమౌళి ప్లాన్. ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో రాజమౌళి మల్టి స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రాన్ని మరో రెండు నెలల్లో ప్రారంభించాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల చిత్రం వాయిదా పడడమో, ఆగిపోవడమో జరగక తప్పదని చెబుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..!