సుక్కు అండ్ టీమ్ కు రాజమౌళి గ్రీటింగ్స్ ?

Thursday, September 13th, 2018, 11:36:08 PM IST


క్రేజీ దర్శకుడు సుకుమార్ అండ్ టీమ్ కు సంచలన దర్శకుడు రాజమౌళి అభినందనలు తెలిపాడు. ఇంత సడన్ గా రాజమౌళి ఎందుకు గ్రీటింగ్స్ చెప్పాడని అనుకుంటున్నారా .. ? ఆ వివరాల్లోకి వెళితే సుకుమార్ ఆ మధ్య నాగ చైతన్య , తమన్నా లతో తీసిన 100 పర్సెంట్ లవ్ సూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతుంది. తాజగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. జివి ప్రకాష్ కుమార్ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం రేపిన షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 100 కాదల్. ఈ సినిమాతో సుకుమార్ నిర్మాతగా తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగులో సుకుమార్ క్రియేటివ్ రైటింగ్స్ బ్యానర్ పై ఇప్పటికే తెలుగులో సినిమాలు నిర్మిస్తున్న సుకుమార్ ఇప్పుడు తమిళంలో తెరకెక్కుతున్న 100 పర్సెంట్ కాదల్ సినిమాకు శ్రీమతి భువన చంద్రమౌళి తో కలిసి నిర్మిస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు చంద్రమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ టీజర్ విడుదల చేసారు. ఈ సందర్బంగా రాజమౌలి ఈ టీమ్ ని అభినందించారు.

  •  
  •  
  •  
  •  

Comments