వీడియో : రాజమౌళి కబడ్డీ టీమ్ చూశారా?

Tuesday, September 11th, 2018, 02:04:53 PM IST

టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఉంచిన దర్శకుడు రాజమౌళి. జక్కన్నకు డైరెక్షన్ తో పాటు ఆటలు కూడా చాలా ఇష్టం. ఇకపోతే ఇప్పుడు ఆటల రంగంలోకి అడుగుపెడుతున్నారు. తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే అందులో ఒక జట్టును తీసుకున్నారు. నల్గొండ ఈగల్స్ టీమ్ ను సొంతం చేసుకున్నారు. రాజమౌళితో పాటు ఆయన కుమారుడు కార్తికేయ, ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కూడా రాజమౌళితో చేతులు కలిపారు.

ఇక సినిమా టీజర్ ను తలపించేలా జట్టుకు సంబందించిన ఒక థీమ్ వీడియో సాంగ్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ నెల 14వ తేదీన ప్రారంభం కానున్న ఈ ప్రీమియర్ లీగ్ 31వ తేదీ వరకు జరగనుంది. మొత్తంగా 8 టీమ్ లు పాల్గొంటున్నాయి. నల్లగొండ ఈగల్స్‌తో పాటు హైదరాబాద్‌ బుల్స్‌, రంగారెడ్డి రైడర్స్‌, వరంగల్‌ వారియర్స్‌, కరీంనగర్‌ కింగ్స్‌, గద్వాల్‌ గ్లాడియేటర్స్‌, పాలమూరు పాంతర్స్‌, మంచిర్యాల టైగర్స్‌ జట్లు లీగ్ లో పోటీపడనున్నాయి. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ లను నిర్వహించనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments