జ‌క్క‌న్న మైండ్ లో బాహుబ‌లి-3

Friday, September 30th, 2016, 10:54:27 PM IST

raj-mouli
రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి ది బిగినింగ్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించిందో తెలిసిందే. వ‌చ్చే ఏడాది రిలీజ్ కానున్న‌ బాహుబ‌లి ది క‌నుక్లూజ‌న్ తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంద‌ని భారీ అంచ‌నాలున్నాయి. దీంతో బాహుబ‌లి శ‌కం ముగుస్తుంద‌ని అంతా భావించారు. రాజ‌మౌళి వేరే హీరోల‌తో..ప్ర‌భాస్ కొత్త ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తాడ‌ని అనుకుంటున్నాం. కానీ బాహుబ‌లి ప్రెస్ మీట్ లో జ‌క్క‌న్న స్వ‌యంగా కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు మాట్లాడారు.

బాహుబ‌లి మ‌హావృక్షం లాంటింది. బాహుబ‌లి బిగినింగ్.. క‌నుక్లూజ‌న్ లు ఆ చెట్టు కొమ్మ‌లు మాత్ర‌మే. వేళ్లు మాత్రం భూమిలో అలాగే ఉన్నాయి. బాహుబ‌లి-3 కూడా ఉండ‌వ‌చ్చేమోన‌ని ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చారు. జ‌క్క‌న్న లేక‌పోయినా బాహుబ‌లి కొన‌సాగాల‌ని స్వ‌యంగా తెలిపారు. అంటే జ‌క్క‌న్న మ‌న‌సులో బాహుబ‌లి-2కు కొన‌సాగింపుగా బాహుబ‌లి-3ను కూడా చేసే థాట్ ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. బాలీవుడ్ త‌ర‌హాలో కంటిన్యుటీ ఉన్న క‌థ‌ల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల మ‌న ద‌గ్గ‌ర లేరు. బాహుబ‌లి-3 చేస్తే గ‌నుక జ‌క్క‌న్న చేయాలి.