రాజమౌళి మల్టి స్టారర్ లో గ్రాఫిక్స్ ఉండవట!

Monday, December 4th, 2017, 05:16:28 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ మారిన రాజమౌళి మల్టి స్టారర్ గురించి రోజుకో న్యూస్ మీడియాల్లో తెగ హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా రాజమౌళి సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ – ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు సినిమాలో కనిపిస్తుండడంతో సినిమాపై అంచనాలు బారి స్థాయిలో ఉన్నాయి. ఇక లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే.. సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండవని తెలుస్తోంది.

సాధారణంగా జక్కన్న తన సినిమాల్లో కొని సీన్స్ కి గ్రాఫిక్స్ ని బాగా వాడుతుంటారు. కానీ ఈ సినిమాలో ఎక్కువగా ఎమోషన్స్ యాక్షన్ సీన్స్ ని హైలెట్ చేయనున్నారట. ఇప్పటికే సినిమా కాన్సెప్ట్ ని హీరోలిద్దరికి వివరంగా చెప్పాడట జక్కన్న. ఇక రచయిత విజయేంద్ర ప్రసాద్ తో కూర్చొని స్క్రీన్ ప్లే విషయంలో చర్చలు జరుపుతున్నారు. వీలైనంత వరకు కథను పూర్తి చేసి మొత్తంగా ఒకసారి చెర్రీ – తారక్ లకు వివరిస్తారట. అప్పుడు సినిమాపై అధికారికంగా వివరను ఇస్తారని సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments