రాజ‌మౌళి అలా నిర్ణ‌యం తీసుకొన్నాడా?

Friday, September 30th, 2016, 05:53:01 PM IST

rajamouli
ద‌ర్శ‌కుడు రాజమౌళి వ్యూహాలే వేరుగా ఉంటాయి. ఆయ‌న తీసే క‌థ‌ల విష‌యంలో నే కాదు, త‌న కెరీర్ విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్తగా ఉంటారు.ఎప్పుడు ఏ సినిమా చేయాలి, ఏ పాత్ర‌కి ఏ న‌టుడిని ఎంచుకోవాలనే విష‌యాలు రాజ‌మౌళికి తెలిసినట్టు మ‌రెవ్వ‌రికీ తెలియ‌వ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మాట్లాడు కొంటుంటాయి. ఆకాశ‌మే హద్దు అనిపించేంత గ్రాండియ‌ర్ సినిమాలు తీస్తాడు రాజ‌మౌళి. ఆ వెంట‌నే త‌న‌పై పెరిగిన భారీ అంచ‌నాల్నిత‌గ్గించుకొనేలా చిన్న సినిమాలు మొద‌లు పెట్టేస్తుంటాడు.’మ‌ర్యాద రామ‌న్న‌’, ‘ఈగ‌’ సినిమాలు ఆ కోవ‌కి చెందిన‌వే. త‌న‌పైన‌, త‌న సినిమాల‌పైన ప్రేక్ష‌కుల అంచ‌నాలు త‌క్కువ‌య్యాయి అనుకొన్న వెంట‌నే మ‌ళ్లీ పెద్ద సినిమాలు తీస్తుంటాడు. `బాహుబ‌లి`తో రాజ‌మౌళి ఇమేజ్ఎ క్కడికో వెళ్లిపోయింది. ప్ర‌పంచ స్థాయిలో ఆయ‌న సినిమాల గురించి మాట్లాడుకొంటున్నారు. అంటే త‌దుప‌రి సినిమాని ఇంకే రేంజ్‌లో చేయాలో ఊహించుకోండి. మ‌రి ప్ర‌తిసారీ బాహుబ‌లి లాంటి సినిమాలు తీయ‌డం సాధ్య‌మా? వందల కోట్లు పెట్టుబ‌డులు పెట్టే నిర్మాత‌లు దొరుకుతారా? ఆ ప్ర‌య‌త్నం అస‌లు శ్రేయ‌స్క‌ర‌మేనా? కానే కాదు. అది తెలుసుకొనే రాజ‌మౌళి మ‌ళ్లీ ఓ చిన్న సినిమాని తీయాల‌ని ప్లాన్ చేసు కొంటు న్నాడ‌ట‌. నాని లాంటి క‌థానాయ‌కుడితో ఆ సినిమా చేయాల‌నుకొంటున్నాడ‌ట‌. నానినే హీరో అయితే ‘ఈగ’సీక్వెలా అనే ఈక్వేష‌న్స్ మొద‌ల‌వుతాయి. అందుకే ఓ కొత్త హీరోతో క్లాస్ల‌ వ్‌ స్టోరీని తీయ‌బోతున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మాట్లాడుకొంటున్నాయి. ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల‌కి బాహుబ‌లి 2 కి సంబంధించి ప్రెస్‌మీట్‌లో పాల్గొంటున్నాడు జ‌క్క‌న్న‌. అస‌లు విష‌యం అక్క‌డ తెలిసే అవ‌కాశం ఉంటుంది.