రజని రోబో 2. 0 వాయిదా పడ్డట్టేనా ?

Sunday, December 3rd, 2017, 04:06:32 PM IST

సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో సినిమా జనవరి 25న విడుదల అవుతుందని ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. దానికి కారణం ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో ఇంకా పనులు మిగిలి ఉన్నందునే సినిమా విడుదల వాయిదా వేస్తున్నారని వచ్చే ఏప్రిల్ లో విడుదల చేస్తారట. ఈ విషయం గురించి నిర్మాతలు అథికారికంగా ప్రకటించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి రకరకాల వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల చేస్తున్నట్టు యూనిట్ ప్రకటించడంతో ఏ డేట్ అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దాంతో జనవరిలో రోబో కోసం వెనక్కి వెళ్లిన సినిమాలన్నీ ముందే విడుదల అవుతున్నట్టు తెలిసింది.

  •  
  •  
  •  
  •  

Comments