రాజా రవీంద్ర : కార్తీక్ ఒక బ్లాక్ మెయిలర్ – తానే డబ్బు డిమాండ్ చేశారు

Friday, August 23rd, 2019, 12:02:03 AM IST

సినీ నటుడు రాజ్ తరుణ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. కాగా మూడు రోజుల క్రితం నటుడు రాజ్ తరుణ్ కారు ప్రమాదంలో చిక్కుకున్నాడన్న సంగతి మనకు తెలిసిందే… కాగా ఆ సమయంలో రాజ్ తరుణ్ మద్యం సేవించి ఉన్నాడని, కానీ ఆతరువాత భయంతో పారిపోయాడని కార్తీక్ అనే యువకుడు సంబంధిత వీడియోలను మీడియా ద్వారా బయటపెట్టారు… అంతేకాకుండా ప్రమాదం జరిగిన సమయంల తానూ అక్కడే ఉన్నానని, రాజ్ తరుణ్ ని వెంబడించి పట్టుకున్నానని కార్తీక్ అనే వ్యక్తి చెప్పారు. అయితే రాజ్ తరుణ్ మేనేజర్ తనని బెదిరింపులకు గురి చేశారని, ప్రమాదానికి సంబందించిన వీడియోలను తనకు ఇచ్చేయాలని లేదంటే అనవసరంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని కార్తీక్ మీడియాముఖంగా చెప్పారు.

కాగా కార్తీక్ చేసిన వాఖ్యలపై స్పందించిన రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర, కార్తీక్ చేసిన వాఖ్యాలను కొట్టి పారేశారు… ఈమేరకు మాట్లాడిన రాజా రవీంద్ర కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశారు. కార్తీక్ ఓ బ్లాక్ మెయిలర్ అని, అతడు తమను రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని లేకపోతె మీడియా కు ప్రమాదానికి సంబందించిన వీడియోలు ఇస్తానని బెదిరించాడని, చివరికి 3 లక్షలైనా ఇవ్వాలని బెదిరింపులకు గురి చేశారని రాజా రవీంద్ర ఆరోపించారు. అంతేకాకుండా ప్రమాద సమయంలో రాజ్ తరుణ్ మద్యం సేవించాడని చెబుతున్న వార్తల్ ఎలాంటి నిజం లేదని రాజా రవీంద్ర స్పష్టం చేశారు.