అందరూ నేను హీరో ఏమిటని అడిగారు – రాజశేఖర్

Tuesday, October 31st, 2017, 04:46:26 PM IST

ఒకప్పుడు భారీ హిట్లిచ్చి యాంగ్రీ యంగ్ మాన్ అనే పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక దాదాపు కనుమరుగైపోయే పరిస్థితిలో ‘పిఎస్వి గరుడవేగ’ సినిమా చేసి ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చారు. నవంబర్ 3న విడుదలకానున్న ఈ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారాయన. ఈ సినిమా సుమారు రూ.30 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుడంతో అందరూ రాజశేఖర్ పై అంత భారీ మొత్తాన్ని పెట్టడం సాహసమనే అన్నారు. కొందరైతే డబ్బు ఖాయంగా పోయినట్టే అని కామెంట్ చేశారు. ఇలాంటి కామెంట్స్ పట్ల రాజశేఖర్ కాస్త తీవ్రంగా స్పందించారు.

నా పరిస్థితి బాగోలేనప్పుడు చాలా మంది క్యారెక్టర్ రోల్స్, విలన్ పాత్రల కోసం నన్ను సంప్రదించారు తప్ప హీరో పాత్రలు ఎవరూ తీసుకురాలేదు. వచ్చినా కూడా కేవలం 3, 4 కోట్ల వరకే పెట్టగలం, అంతకన్నా ఎక్కువైతే కష్టమని అన్నారు. కొందరైతే ప్రవీణ్ సత్తారుని ఇంట మంచి కథలో రాజశేఖర్ హీరో ఏమిటి ? ఆయన్ను ఎలా తీసుకున్నారు ? అనే ప్రశ్నలు కూడా వేశారు. వాళ్లంతా అలా అడుగుతుంటే అంతలోనే నా పని అయిపోయిందా, అంతా నా బ్యాడ్ టైమ్.. ఏం చేస్తాం అనుకున్నాను అంటూ తన చేదు అనుభవాలను బయటపెట్టారు.

  •  
  •  
  •  
  •  

Comments