రెండు సినిమాలను ఒకే చేసిన రాజశేఖర్?

Thursday, January 25th, 2018, 02:48:45 PM IST

సీనియర్ హీరో రాజశేఖర్ చాలా కాలం తరువాత గరుడవెగ సినిమాతో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే నెక్స్ట్ కూడా మంచి హిట్స్ తో ఇండస్ట్రీలో తన మార్కెట్ ను ఇంకా పెంచుకోవాలని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం రాజశేఖర్ ఎలంటి సినిమాలను ఒకే చేయనున్నారు అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. కొంతమంది బడా దర్శకులతో ఆయన వర్క్ చేయనున్నారని చాలా వార్తలు వస్తున్నాయి. కానీ ఫైనల్ గా సినిమా స్క్రిప్ట్ ఒకే అయ్యేంత వరకు రాజశేఖర్ ఏ విషయాన్నీ బయటపెట్టకూడదు అని అనుకుంటున్నాడు. అయితే దాదాపు రెండు కథలను ఒకే చేసినట్లు తెలుస్తోంది. మణిరత్నం దగ్గర వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ గోపి డైరెక్షన్ లో ఒక సినిమాను అలాగే కన్నడ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నాగ శేఖర్ దర్శకత్వంలో మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివాని నటిస్తుందట. ఆమెకు జోడిగా కుర్ర హీరో నటిస్తాడట. ఇక రాజశేఖర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.