షాకింగ్ న్యూస్: రాజశేఖర్ కారులో మద్యం సీసాలు లభ్యం– ప్రమాదానికి కారణాలు ఇవే?

Wednesday, November 13th, 2019, 11:23:55 AM IST

అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన రాజశేఖర్ కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఈ కారుని అధికారులు సీజ్ చేయగా దీనిపై విచారణ జరగనుంది. అయితే కారు చాల వేగంగా డివైడర్ ని ఢీ కొట్టడం తో పల్టీలు తిరిగి బోల్తా పడింది. కారు నడుపుతున్నప్పుడు కారు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఉందని తెలిసింది. అయితే స్వల్ప గాయాలతో బయటపడిన రాజశేఖర్ తాను క్షేమంగానే వున్నారని కూతురు శివాత్మిక సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. మీ ప్రేమకి, ప్రార్థనలకు థాంక్స్ అంటూ తెలిపారు.

అయితే ప్రమాదానికి గల కారణం హై స్పీడ్ లేదంటే మద్యం మైకం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారులో మద్యం సీసాలు ఉండటం, గంటకు 180 కిలోమీటర్ల వేగం తో కారు ప్రయాణిస్తుండటం కారణాలైతే, కారు పై ఇప్పటికే మూడు ఓవర్ స్పీడ్ పెండింగ్ చలానాలు ఉన్నట్లు తెలిసింది. విజయవాడ నుండి వస్తుండగా గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి