విలన్ గా టర్న్ అవుతున్న రాజశేఖర్ ?

Tuesday, May 1st, 2018, 01:13:03 PM IST

యాంగ్రీ యాంగ్ మెన్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో రాజా శేఖర్ విలన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆ దిశగా చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలిసింది. ఈ మద్యే వరుస పరాజయాలతో కెరీర్ డీలా పడిన రాజశేఖర్ కాస్త గ్యాప్ తీసుకుని చేసిన గరుడవేగా సినిమాతో మళ్ళీ అయన ఫామ్లోకి వచ్చాడు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో హీరో రామ్ నటిస్తున్న సినిమాలో రాజశేఖర్ విలన్ గా చేస్తున్నాడట. ఇటీవలే ఈ సినిమా మొదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం పలువురిని పరిశీలించి ఫైనల్ గా ఆ అవకాశం రాజశేఖర్ కు ఇచ్చాడని, కథ విన్న తరువాత రాజశేఖర్ కూడా ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయ్. దాంతో పాటు ఓ తమిళ సినిమాలో కూడా రాజశేఖర్ విలన్ గా నటిస్తున్నాడు.

Comments