మ‌ణిర‌త్నం `రోజా`ను త‌ల‌పించే సినిమా?

Tuesday, April 10th, 2018, 09:22:46 PM IST

ఆలియా భ‌ట్ టైటిల్ పాత్ర పోషించిన `రాజీ` మే 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. తొలిసారి ఆలియా ఓ ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టిస్తోంద‌ని, త‌న కెరీర్ బెస్ట్ రోల్ పోషిస్తోంద‌ని తాజాగా రిలీజైన పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ చెబుతున్నాయి.

లేటెస్టుగా రిలీజైన ట్రైల‌ర్‌లో ఈ సినిమా క‌థేంటో రివీలైంది. ఓ ర‌కంగా చెప్పాలంటే ఈ ట్రైల‌ర్ చూస్తున్నంత‌సేపు మ‌ణిర‌త్నం `రోజా` గుర్తుకొస్తోంది. మంచు కొండ‌ల్లో, సైన్యం ప‌హారా కాసే బార్డ‌ర్‌లో టెర్ర‌రిస్టులు కిడ్నాప్ చేసిన త‌న భ‌ర్త‌ను వెతుక్కుంటూ వెళ్లే భార్యామ‌ణిగా నాడు మ‌ధుబాల న‌టించింది. ఉత్త‌మ జాతీయ న‌టిగా అవార్డు అందుకుంది. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ మంచు కొండ‌లు, తీవ్ర‌వాదం బ్యాక్‌డ్రాప్ రాజీ సినిమాలో క‌నిపిస్తోంది. అయితే ఇక్క‌డ రాజీ భ‌ర్త ఓ ఆర్మీ అధికారి. ఊహించ‌ని స‌న్నివేశంలో దేశం కోసం ఆలియా గూఢ‌చారిగా మారాల్సి వ‌స్తుంది. అటుపై బార్డ‌ర్‌లో రాజీ సాహ‌స‌విన్యాసాలేంటి? అన్న ఆస‌క్తిక‌ర క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇక ఇది రియ‌ల్ స్టోరి ఆధారంగా తెర‌కెక్కించామ‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో రాజీ భ‌ర్త‌గా విక్కీ కౌశ‌ల్ న‌టించారు. మేఘ‌న గుల్జార్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా అవార్డులు, రివార్డులు కొల్ల‌గొడుతుందా? అన్న సిగ్న‌ల్స్ క‌నిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments