మంత్రి గారి ఇంట .. బ్రేక్‌ఫాస్ట్ చేసిన రాజేంద్రుడు!

Saturday, January 21st, 2017, 06:08:21 PM IST

thalasni
మా అసోసియేష‌న్ అధ్య‌క్షులు, న‌ట‌కిరీటి డా.రాజేంద్ర ప్ర‌సాద్ మెగా అండ‌దండ‌ల‌తో న‌టీన‌టుల సంఘాన్ని న‌డిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌డికి మెగా స్టార్ ఇంట కానీ, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి ఇంట కానీ చాలా గౌర‌వం ఉంటుంది. అలాగే అత‌డు వ‌స్తున్నాడంటే ఎంతో ప్రేమాప్యాయ‌త‌ల‌తో ఆ ఇద్ద‌రూ రిసీవ్ చేసుకుంటారు. ఇదిగో ఈరోజు అదే త‌ర‌హాలో రెడ్ కార్పెట్ వేశారు.

సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్‌ని నేటి ఉద‌యం `మా బృందం` న‌టీన‌టుల ఫోన్ నంబ‌ర్ల‌తో కూడిన `మా డైరీ-2017`ని అంద‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా త‌ల‌సాని ఇంట ఎర్లీ మోర్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ కార్య‌క్ర‌మంలో `మా` అధ్య‌క్షులు డా.రాజేంద్ర ప్ర‌సాద్‌, మా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివాజీ రాజా, మా స‌భ్యులు ఏడిద శ్రీ‌రామ్‌, `సంతోషం` అధినేత సురేష్ కొండేటి త‌దితరులు పాల్గొన్నారు.. ఆ దృశ్యాల‌మాలిక ఇది..