ర‌జ‌నీ- క‌మ‌ల్ మ‌ల్టీస్టార‌ర్‌?

Monday, July 23rd, 2018, 07:35:02 PM IST

సూప‌ర్‌స్టార్‌ రజనీకాంత్ – క‌మ‌ల్‌హాస‌న్ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కే అవ‌కాశం ఉందా? ఇరువురు స్నేహితులు క‌లిసి ఒకే సినిమాలో న‌టిస్తే చూడాల‌ని అభిమానుల కోరిక‌. కానీ అది ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యే ప‌ని కానేకాద‌ని విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఖ‌రాకండిగా చెప్పేశారు. ఇటీవ‌ల క‌మ‌ల్‌హాస‌న్ మక్కల్‌ నీది మయ్య ం పేరుతో రాజ‌కీయ పార్టీ స్థాపించిన కమల్ ప్ర‌స్తుతం పార్టీ అభివృద్ధే ధ్యేయంగా కస‌ర‌త్తు చేస్తున్నారు. నిత్య ం జ‌నాల్లోకి వెళ్లి వారి స‌మ‌స్య‌లు వింటున్నారు. మ‌రోవైపు పెండింగులో ఉన్న సినిమాల్ని రిలీజ్ చేసే ప‌నిలో ఉన్నారు. విశ్వ‌రూపం 2 ఆగ‌స్టు 10న‌ రిలీజ్‌కి వ‌స్తున్న సంద‌ర్భ ంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నారు. వేరొక వైపు బుల్లితెర‌పై బిగ్‌బాస్ రియాలిటీ షో హోస్ట్‌గానూ అద‌ర‌గొడుతున్నారు. ఓ ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక‌తో మాట్లాడిన క‌మ‌ల్ ర‌జ‌నీతో క‌లిసి న‌టిస్తారా? అన్న ప్ర‌శ్న‌కు పైవిధంగా స్ప ందించారు. నెలలో నాలుగు రోజులు మాత్రమే బిగ్‌బాస్‌కు, మిగతా రోజులు రాజకీయాలపైనే దృష్టిపెడుతున్నాన‌ని తెలిపారు. ఇక‌పై సినిమాల్ని త‌గ్గించేస్తున్నాన‌ని, సినిమాలు చేస్తే ప్ర‌తి చిన్న అంశం తానే ద‌గ్గ‌రుండి చూడాల్సి రావ‌డం ఇబ్బ ందిగా ఉంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం ర‌జ‌నీ, నేను చాలా త‌క్కువ సినిమాలు చేస్తున్నాం. భ‌విష్య‌త్ అంతా రాజ‌కీయాల‌తోనే బిజీ. అందుకే మేం క‌లిసి న‌టించే అవ‌కాశం కూడా లేద‌ని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments